భారత యువ పేసర్ కుల్దీప్ సేన్ అంతర్జాతీయ ఆరంగ్రేట మ్యాచ్ను తన తండ్రి రాంపాల్ చూడనే లేదు. ఆ రోజంతా తన సెలూన్లో కస్టమర్లకు క్షవరం చేస్తూ గడిపాడు. పైగా ఆదివారం కావడంతో కస్టమర్లు ఎక్కువగా రావడంతో ఆయన అక్కడే గడిపాడు. ఆ సెలూన్లో టీవీ, ఫోన్ కూడా లేకపోవడం విశేషం. మరోవైపు కుల్దీప్ సోదరుడు, చెల్లెలు, స్నేహితులు మాత్రం ఇంట్లో కూర్చుని టీవీలో మ్యాచ్ ఆస్వాదించారు. ఆ మ్యాచ్లో కుల్దీప్ రెండు వికెట్లు తీయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Courtesy Twitter: BCCI
Courtesy Twitter: Indian Domestic Cricket Forum