ఉత్తరాఖండ్ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ రాష్ట్రంలో మొత్తం 70 స్థానాలు ఉండగా భాజపా 44 స్థానాల్లో ముందంజవేసి రెండోసారి విజయందిశగా పరుగులు పెడుతుంది. కాని ప్రస్తుత సీఎం, భాజపా కీలక నేత పుష్కర్‌సింగ్ దమీ మాత్రం కతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కంటే 2,287 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ కీలక నేత హరీశ్ రావత్ కూడ బీజేపీ అభ్యర్థి మోహన్ సింగ్ బిస్త్ కంటే 13,893 ఓట్ల తేడాతో ఓటమిదిశగా అడుగులు వేస్తున్నారు.