తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. వేద పండితుల సూచన మేరకే ఆ రోజు ఓపెనింగ్ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి పలువురు జాతీయ నేతలను కూడా ఆహ్వానించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం సోరెన్ హాజరవుతారు. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు.