తెలంగాణలో నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారయ్యింది. వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తుది దశకు చేరిన పనుల్లోవేగం పెంచాలని రోడ్లు, భవనాల శాఖ అధికారులను సహా నిర్మాణ సంస్థను ఆదేశించారు. ముందుగా 6వ బ్లాక్ లోని సీఎం కార్యాలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజల అనంతరం కేసీఆర్ అడుగుపెడతారని తెలుస్తోంది. అప్పట్నుంచి సచివాలయం నుంచే పనులు కొనసాగుతాయని వెల్లడించారు.
కొత్త సచివాలయం ప్రారంభోత్సవ ముహుర్తం

© ANI Photo