ఫిబ్రవరి 1న కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్లో నైనా ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తారేమోనని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే, తొలుత ఆదాయపు పన్నును 1949-50 బడ్జెట్లో ప్రవేశ పెట్టారట. రూ.1,500 కంటే ఎక్కువ వేతనం ఉన్నవారిని పన్ను పరిధిలోకి తీసుకొచ్చారట. రూ.1,500 నుంచి రూ. 5,000 వరకు వార్షిక ఆదాయమున్న వారికి 4.69శాతం పన్ను విధించారట. ప్రస్తుతం బేస్ శ్లాబు రూ.2.5లక్షలుగా ఉంది. రూ.2.5లక్షల నుంచి రూ.5 లక్షల వేతనమున్న వారికి 5శాతం పన్ను విధిస్తున్నారు. దీనినే సవరించాలని ఉద్యోగులు భావిస్తున్నారు.