తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత పెరిగింది. ఉదయం పూట బయటకు రావాలంటే వణికి పోతున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు, వృద్ధులు సాధ్యమైనంత వరకు మార్నింగ్ వాకింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలోని వికారాబాద్‌లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు విశాఖ ఏజెన్సీ ప్రాంతల్లోనూ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాయి. సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత

© ANI Photo