తెలంగాణలో వాహనాలపై విధించే లైఫ్ ట్యాక్స్ భారీగా పెరిగింది. ఇదివరకు 2 శ్లాబులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటిని నాలుగు చేసి ట్యాక్స్ రేట్లను కూడా మార్పు చేశారు. ఈ కొత్త రేట్లు మే 9 నుంచి అమల్లోకి వచ్చాయి. పన్ను శ్లాబులను ఆయా వాహనాలు, వాటి సీట్లను బట్టి పలు రకాలుగా నిర్ణయించారు. వాహనం ధర రూ.10 లక్షల్లోపు ఉంటే 13 శాతం, రూ.20 లక్షల కంటే ఎక్కువ ధర ఉంటే 17 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ఇది గతంలో 12, 14 శాతం ఉండేది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువగా వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వాహనదారులు పెంచిన రెట్ల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.