కరోనా కేసులు దాదాపు పూర్తిగా తగ్గాయి. కొవిడ్ ఆంక్షలు కూడా సడలించారు. మరోవైపు ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానం తొలగించాయి. తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని ఆయా సంస్థలు ప్రకటించాయి. దీంతో ఉద్యోగులందరూ భాగ్యనగరానికి చేరుకున్నారు. మళ్లీ పాత పద్దతిలో రోజు కార్యాలయాలకు వెళ్తున్నారు. మరోవైపు విద్యాసంస్థలు కూడా తిరిగి మొదలయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికులు పెద్ద ఎత్తున ప్రయాణిస్తున్నారు. పలు మార్గాల్లో రోజుకు దాదాపు 3.80 లక్షల నుంచి 4 లక్షలకుపైగా రాకపోకలు సాగిస్తున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ఒక్క సోమవారమే ఎల్బీనగర్-మియాపూర్ రూట్లో 1.50 లక్షల మందికిపైగా ప్రయాణించినట్లు పేర్కొన్నారు.