అహ్మదాబాద్ వేదికగా బోర్డర్-గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 107 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు సాయంతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లీకి తోడు రవీంద్ర జడేజా (5) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 271 పరుగులుగా ఉంది.