నేడు రాయ్‌పూర్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి ఊపు మీద ఉన్న టీమిండియా .. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఓడిన కసితో ఉన్న కివీస్.. మ్యాచ్ గెలిచి సిరీస్ రేసులో నిలవాలని యోచిస్తోంది. భారత బౌలర్ల ప్రదర్శన ఇంకా మెరుగవ్వాల్సి ఉంది. తొలి వన్డేలో శుభమన్ గిల్ (208), రోహిత్ 34 మినహా మిగతా బ్యాటర్లు రాణించింది లేదు. రాయ్‌పూర్ పిచ్ అటు బ్యాటింగ్‌కు ఇటు బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మ్యాచ్ టైం: 1.30pm.