టీమిండియా మరోసారి క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో భాగంగా రేపు చివరి మ్యాచ్ ఆడనున్న భారత్…కివీస్‌ను చిత్తు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. ఇండోర్ వేదికగా హోల్కర్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఇక్కడ టీమిండియాకు భారీ రికార్డులే ఉన్నాయి. ఒక్కసారి కూడా మ్యాచ్ ఓడిపోలేదు. సెహ్వాగ్ ఈ మైదానంలోనే 219 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 418 పరుగులను భారత్ ఇక్కడే నమోదు చేసింది. పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది.