మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు జరుగుతున్న ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచులో ఇండియన్ ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. ఆస్ట్రేలియాతో ఆడిన జట్టులో ఒక మార్పు చేశారు. మేఘనా సింగ్ స్థానంలో పూనమ్ యాదవ్ ను ఆడిపిస్తున్నారు.
**జట్టు..**
స్మృతి మంధాన, షఫాలి వర్మ, యసిక్త భాటియా, మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్, స్నేహ్ రానా, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్, పూనమ్ యాదవ్