సూపర్‌ 4కు దూసుకెళ్లిన భారత్‌

© ANI Photo

ఆసియా కప్‌లో పాక్‌పై అద్భుత విజయంతో జోరు మీదున్న భారత్‌.. పసికూన హాంకాంగ్‌పై ఘన విజయం సాధించింది. 40 పరుగుల తేడాతో హాకాంగ్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ 68 పరుగులతో విశ్వరూపం ప్రదర్శించగా, కోహ్లీ 59 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్‌ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఆ జట్టులో బాబర్‌ హయత్‌ 41 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత జట్టులో భువీ, అర్ష్‌దీప్‌, జడేశా, అవేశ్‌ఖాన్‌ తలో వికెట్ తీశారు. సూర్య ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Exit mobile version