ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కోహ్లీ, గిల్, అక్షర్ పటేల్ రాణించడంతో భారీ స్కోరు సాధించింది. 571 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కోహ్లీ 186 పరుగులు చేసి డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఒకానొక దశలో 200 పరుగుల కోసం ప్రయత్నిస్తున్నా సమయంలో ఎవ్వరూ సహకరించలేదు. టీమిండియాకు 91 పరుగుల ఆధిక్యం లభించింది. గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు దిగలేదు.