హైదరాబాద్ ఉప్పల్లో జరగబోయే భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. మెుత్తం 39 వేల టికెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆన్లైన్లో ఉంచింది. అంతకముందు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్కు సంబంధించి సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల 16 వరకు టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ నెల 18న మ్యాచ్ జరగనుంది.