భారత్-ఆసీస్ చివరి టెస్టు మ్యాచ్ ప్రత్యేకత సంతరించుకోనుంది. 75 ఏళ్ల ఇండో-ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ స్టేడియానికి రానున్నారు. టాస్ సమయంలో మోదీ నాణెం ఎగరేసే అవకాశాలున్నాయి. ఆయన కాసేపు మ్యాచ్ వ్యాఖ్యానం కూడా చేస్తారని తెలిసింది. మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల ప్రధానులు బంగారు పూత పూసిన గోల్ఫ్ కారులో స్టేడియంలో తిరిగే ఛాన్స్ ఉంది. మొదటి రోజు లక్ష మంది ప్రేక్షకులు స్టేడియానికి వస్తారని, ఇప్పటికే 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయని సమాచారం.