గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,993 కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్నటితో పోల్చుకుంటే కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 8.5 శాతం మేర తగ్గింది. ఇంత తక్కువగా కేసులు రావడం గడిచిన 660 రోజుల్లో ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 49,948కి చేరుకుంది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసుల సంఖ్య 5,000 కంటే దిగువే నమోదయింది. నిన్న కరోనాతో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదయిన కేసుల సంఖ్య 4,29,71,308.