దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4,575 కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్నటితో (3,993) తో పోల్చుకుంటే కేసుల సంఖ్య దాదాపు 15 శాతం మేర పెరిగింది. 145 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 46,962 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 4,29,75,883 మందికి కరోనా సోకింది. 5 లక్షల పైచిలుకు మంది కరోనాతో దుర్మరణం చెందారు.