ఇండియాలో గడిచిన 24 గంటల్లో 1,233 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 31 మంది దుర్మరణం చెందారు. ప్రస్తుతం దేశంలో 14,704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మనదేశంలో కేసులు తగ్గుతున్నా కానీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో అందరూ గాబరాపడుతున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 15 వేల కంటే దిగువకు రావడం శుభపరిణామం.