గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1,778 కరోనా కేసులు నమోదయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య ఎక్కువగానే నమోదైంది. 24 గంటల్లో 62 మంది కరోనాతో దుర్మరణం చెందారు. 2,542 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 23,087 యాక్టివ్ కేసులు ఉన్నాయి.