శ్రీలంకతో జరుగుతున్న ఏకైక పింక్ బాల్ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్ లో లంకను 109 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా, తన రెండో ఇన్నింగ్స్‌ను 303/9 వద్ద డిక్లేర్ చేసింది. ఇండియా ఇన్నింగ్స్‌లో పంత్ (50), అయ్యర్ (67) పరుగులు చేశారు. లంక ఈ టెస్టును గెలవాలంటే 447 పరుగుల భారీ స్కోరు చేయాలి. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎంబుల్దేనియా 3, జయవిక్రమ 4 వికెట్లతో మెరిశారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత స్పీడ్ స్టర్ బుమ్రా 5 వికెట్లతో సత్తా చాటాడు.