మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత భారాసకు లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భారాసలో మహిళా విభాగమే లేదన్నారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్సీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. తొలి ఐదేళ్ల పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. అటు కవితకు ఇచ్చిన ఈడీ నోటీసులకు తెలంగాణ సమాజానికి ఏంటీ సంబంధమని ప్రశ్నించారు. విచారణకు పిలిస్తే వెళ్లి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాలు విసిరారు.