ఇండియాలో గడిచిన 24 గంటల్లో 5,291 కొత్త కరోనా కేసులు నమోదయినట్లు వైద్య శాఖ ప్రకటించింది. అంతే కాకుండా కరోనాతో మరో 289 మంది కూడా మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 63,878కి చేరుకుంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.63 శాతానికి పడిపోయింది. 1,78,55,66,940 మందికి ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ వేశారు.