నేడు బెంగుళూరులో ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ కనెక్ట్ (ఐజీఐసీ) ప్రారంభమవుతుంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్ భాగస్వామ్యంతో అడ్వైజరీ సంస్థ స్మాద్యా అండ్ స్మాద్యా నిర్వహిస్తోంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత ర్యాంకు 2016లో 66వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 46వ ర్యాంకుకు చేరిందని స్మాడ్జా & స్మాడ్జా అడ్వైజరీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ క్లాడ్ స్మాడ్జా పేర్కొన్నారు. ఈ సదస్సు భారత అంకుర సంస్థల సామార్థాలు, ఆవిష్కరణల గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. తొలి అంతర్జాతీయ సదస్సులో భారత్‌తో పాటు అమెరికా, కొరియో, జర్మనీ, సింగపూర్, ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ వంటి దేశాల నుంచి 80 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.