కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ చూపించిన తెగువ ప్రపంచదేశాలకు ఆదర్శమని బిల్& మెలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈవో మార్క్ సూజ్‌మన్ ప్రశంసించారు. కోవిడ్ సంక్షోభంలోనూ తయారీ రంగం వృద్ధి చెందటమే కాకుండా.. 2.2 బిలియన్ ఉద్యోగాలు సృష్టించబడ్డాయిని వెల్లడించారు. కరోనా వ్యాప్తిని ఎప్పటికప్పుడూ తెలుసుకుని అరికట్టేందుకు కోవిన్ పోర్టల్‌ను సమర్థంగా ఉపయోగించుకుందని గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌కు జీ-20 అధ్యక్ష పదవీ దక్కడం నిజంగా ప్రొత్సాహకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.