లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ ఉగ్రవాద సంస్థను భారత ప్రభుత్వం నిషేధించింది. ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ సంస్థను 2019లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఆన్‌లైన్‌లో యువకులను రిక్రూట్ చేసుకుని ఉగ్రవాదులుగా మారుస్తోందని భారత హోంశాఖ తెలిపింది. సరిహద్దు చొరబాట్లు, ఆయుధాలు, డ్రగ్స్ అక్రమ సరఫరాలో ఈ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని వెల్లడించింది. భారత్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు హోంశాఖ తెలిపింది.