ఢాకాలో జరిగిన మొదటి వన్డేలో బంగ్లాదేశ్ టీమిండియాను చిత్తు చిత్తుగా ఓడింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి ఒక్క వికెట్ తేడాతో నెగ్గింది. బంగ్లా ఆల్రౌండర్ మొహిదీ హసన్ మిరాజ్ తుదికంటా పోరాడి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. 38 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. చివరి వికెట్కు ముస్తాఫిజుర్తో కలసి మిరాజ్ 52 పరుగులు జత చేశాడు. భారత బౌలర్లలో ఏ ఒక్కరూ వీరిని విడగొట్టలేక చతికలపడ్డారు.