ఐసీసీ వుమెన్స్ వరల్డ్ కప్ నుంచి భారత్ నిష్క్రమించింది. నేడు సౌతాఫ్రికాతో ఆడిన మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో భారత్కు వరల్డ్ కప్ చేజారింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 274/7 స్కోర్ చేసింది. తర్వాత బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముఖ్యంగా లారా వొల్వార్ట్(80) పరుగులతో రాణించింది. భారత బౌలర్లలో హర్మాన్ ప్రీత్, రాజేశ్వరీ రెండు వికెట్ల చొప్పున తీశారు. సెమీ ఫైనల్లో ఇప్పుడు వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి.