ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పినట్టుగా భారత్ 2070 కల్లా సున్నా కర్బన ఉద్గారాల దేశంగా మారాలంటే 10 ట్రిలియన్ డాలర్లు కావాలని జీఈ-ఈవై అధ్యయనం నివేదిక పేర్కొంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.770 లక్షల కోట్లు అవసరమని స్పష్టం చేసింది. సమీప భవిష్యత్తులో భారత్ బొగ్గు ఆధారిత విద్యుత్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుందని ఈ నివేదిక నొక్కి చెప్పింది. భారత తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అవసరమని సూచించింది. గ్రీన్ హైడ్రోజన్ విధానాన్ని మరింత ప్రోత్సహించాలని నివేదికలో పేర్కొంది.