జనాభాపరంగా చైనాను భారత్ దాటేసినట్లు పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా ఇండియా అవతరించినట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ తెలిపింది. జనవరి 18, 2023 నాటికి భారత్ జనాభా 142.3 కోట్లకు చేరుకున్నట్లు అంచనా. దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించినట్లు తెలుస్తోంది. చైనాలో జననాల రేటు తగ్గడంతో ఆ దేశ రికార్డును భారత్ అధిగమించింది.