అమెరికా వ్యాఖ్యలకు సూటిగా బదులిచ్చిన భారత్

Courtesy Twitter: jai shankar

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని వెల్లడించిన అమెరికాకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ సూటిగా బదులిచ్చారు. అమెరికాలో మానవ హక్కుల పరిస్థితిపై తమకుండే అభిప్రాయాలు తమకుంటాయని.. సందర్భం వచ్చినప్పడు వాటిపై మాట్లాడేందుకు వెనకాడమని చెప్పారు. భారత్-అమెరికా మధ్య 2+2 స్థాయిలో చర్చ జరిగినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలు, ఇండో-ఫసిపిక్ అంశాలు, శ్రీలంక సంక్షోభం తదితర అంశాలపై చర్చ జరిగిందని వెల్లడించారు.

Exit mobile version