రష్యా నుంచి రాయితీతో ముడిచమురు ఆఫర్ను భారత్ స్వీకరించడం అమెరికా ఆంక్షల ఉల్లంఘన కిందకు రాదని అమెరికా పేర్కొంది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ వెల్లడించారు. తాము విధించిన నిబంధలకు కట్టుబడి ఉండాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దాడికి భారత్ మద్దతు ఇవ్వలేదు. చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని తెలిపింది. అయినప్పటికీ, రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానాల విషయంలో తటస్థ వైఖరిని ప్రదర్శించింది. ఇప్పటికే రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్ తీసుకోకూడదని అమెరికా ఐరోపా దేశాలను జెలెన్స్కీ కోరారు.