2040 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 20 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. తలసరి ఆదాయం 15 వేల డాలర్లకు చేరుతుందని అభిప్రాయపడ్డారు. కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్పై రష్యా దాడి వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథం పట్టాలు తప్పిందన్నారు. దీనివల్ల వస్తువుల ధరలు పెరిగినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మెరుగ్గానే ఉందన్నారు. మరోవైపు 2026-27 నాటికి ఇండియా 5 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని IMF అంచనా వేసింది.