చైనా జనాభా తొలిసారి 8.50 లక్షలు తగ్గింది. వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుండటం.. జననాల రేటు తగ్గుతుండటంతో జనాభా కూడా తగ్గిందని చైనా ప్రకటించింది. 95.6 లక్షల జననాలు, 1.04 కోట్ల మరణాలతో అక్కడి జనాభా 141.18 కోట్లుగా ఖరారు చేశారు. అయితే..2023 ఏప్రిల్ నాటికి భారత్ అత్యధిక జనాభా ఉన్న దేశంగా అవతరిస్తోందని ఐరాస వెల్లడించింది. ఈ లెక్కన భారత జనాభా 2050 నాటికి 166.80 కోట్లకు చేరుతుంది. అప్పుడు చైనాలో 131.70 కోట్లే ఉంటారు.