నేటి నుంచే ఇండియాVSశ్రీలంక మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా లంక ఆటగాడు వనిందు హసరంగకు కరోనా సోకింది. దీంతో అతడు ఐసోలేషన్‌కు వెళ్లిపోయాడు. ఇక ఇండియా జట్టు విషయానికి వస్తే కీలకమైన మూడో డౌన్లో ఎవరు బ్యాటింగ్ చేస్తారా? అని ఇటు అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి టీ20 లక్నోలో, తర్వాతి రెండు మ్యాచులు ధర్మశాలలో జరగనున్నాయి. ఇండియన్ సైడ్‌లో వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌కు ఈ మ్యాచులో అవకాశం లభిస్తుందని అంతా భావిస్తున్నారు. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. లైవ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్, హాట్‌స్టార్‌లో రానుంది.