హాకీ ప్రపంచకప్‌లో వేల్స్‌తో జరిగిన నిర్ణయాత్మక మ్యాచులో భారత్ 4-2 తేడాతో గెలిచి గ్రూపులో రెండో స్థానానికి చేరుకుంది. అయితే, నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి అర్హత సాధించలేకపోయింది. క్వార్టర్స్‌కి చేరాలంటే క్రాస్‌ఓవర్స్‌లో నెగ్గాల్సిందే. ఈ సమరంలో న్యూజిలాండ్‌తో ఆతిథ్య జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. కివీస్ జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తే గాని టీమిండియా క్వార్టర్ ఫైనల్ చేరదు. మరోవైపు, న్యూజిలాండ్ కూడా మంచి ఫామ్‌లో ఉంది. చివరి మ్యాచులో మలేసియాకు 3-2తో షాకిచ్చి రెండో స్థానానికి చేరుకుంది. ఆదివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ప్రీ క్వార్టర్స్ పోరు జరగనుంది.