పాక్ రెచ్చగొట్టే చర్యలను ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత్ చూస్తు ఊరుకోదని అమెరికన్ ఇంటిలిజెన్స్ కమ్యూనిటీ అభిప్రాయపడింది. ‘భారత్ వ్యతిరేక మిలిటెంట్ గ్రూపులకు మద్దతు ఇచ్చిన చరిత్ర పాకిస్థాన్‌కు ఉంది. పాక్ రెచ్చగొట్టే చర్యలకు భారత్ గతంలో కంటే దీటుగా సైనికశక్తితో స్పందించగలదు. కశ్మీర్‌లో అశాంతి వంటి అంశాలు ఈ అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రికత్తలను పెంచుతున్నాయి’ అని పేర్కొంది.