హాకీలో ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియాకు భారత్ షాకిచ్చింది. వారి సొంత గడ్డపై 4-3తో ఓడించి 5 టెస్టుల సిరీస్‌ను 1-2తో సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ డ్రా అవుతుందని అంతా ఫిక్సయిన సమయంలో ఆకాశ్ దీప్ అద్భుత గోల్‌తో భారత్‌ను విజయతీరానికి చేర్చాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో 4-5, రెండో టెస్టులో 4-7తో హర్మన్ సేన ఓటమి పాలైంది. గత ఆరేళ్లలో నిర్ణీత గడువులో ఆస్ట్రేలియాపై గెలవడం మనకు ఇదే తొలిసారి. చివరిగా 2016లో ఓసారి ఆస్ట్రేలియాను ఓడించింది, ఆ తర్వత ఓసారి పెనాల్టీ షూటౌట్ ద్వారా మరోసారి గెలిచింది.
ఆస్ట్రేలియాపై భారత్ విజయం

© ANI Photo