వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో ఇండియన్ వుమెన్స్ 107 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా వుమెన్స్ 245 పరుగులు చేయగా.. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ వుమెన్స్ కేవలం 137 పరుగులకే చాపచుట్టేశారు. భారత బౌలర్లో రాజేశ్వరీ 4, గోస్వామి, స్నేహ్ రానా చెరో రెండు, దీప్తి శర్మ, మేఘనా సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు. పూజకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.