న్యూజిలాండ్‌తో రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదటి వన్డేలో ఆడిన జట్టుతోనే రెండో వన్డే కూడా ఆడనున్నట్లు రోహిత్ తెలిపాడు. తొలి వన్డేలో గెలిచిన ఉత్సాహంతో ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సీరీస్ కైవసం చేసుకోవాలని ఇండియా భావిస్తోంది. భారత జట్టు; రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్, మహ్మద్ షమీ.