జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా టీమిండియా క్రికెట్ ప్లేయర్లు తారక్‌ని హైదరాబాద్‌లో కలిశారు. ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో భారత్ తొలి వన్డేలో పోటీ పడనున్న సంగతి తెలిసిందే. సోమవారం నగరానికి చేరుకున్న భారత ఆటగాళ్లకు పార్క్ హయత్ హోటల్లో విడిది ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ని సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యుజ్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్ తదితరులు కలిశారు. కాసేపు తారక్‌తో ముచ్చటించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.