రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం మీద నిరంతరాయంగా కాల్పులు జరుపుతూనే ఉంది. ఈ దాడుల్లో అనేక మంది అమాయకులు చనిపోతున్నారు. పలు దేశాలు రష్యా మీద ఎన్ని ఆంక్షలను విధించినా కానీ ఫలితం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయాన్ని మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కీవ్ నగరంలో ఒక్కరు కూడా ఇండియన్స్ మిగిలి లేకుండా అందరినీ తరలించామని విదేశాంగ శాఖ అధికారులు ప్రకటించారు. కీవ్ ఇండియన్ ఎంబసీ అధికారులు ఉక్రెయిన్ పశ్చిమ దిక్కుకు వెళ్తున్నట్లు తెలిసింది. అంతే కాకుండా భారత రాయబార కార్యాలయాన్ని కూడా పశ్చిమ దిక్కున ఉన్న ఎల్వివ్ నగరానికి మారుస్తారని తెలుస్తోంది.