రష్యా ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడిని తీవ్రతరం చేసింది. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలనే వ్యూహాత్మకంగా కదులుతూ ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ తమ ప్రజలను వేరే నగరాలకు తరలిస్తోంది. అయితే యుద్ధం నేపథ్యంలో ఏ క్షణమైనా దాడి జరగొచ్చని భావించి, ఆ దేశంలో గల ఇండియా రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలాండ్‌కు తరలిస్తున్నట్లు భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో ఉండడం మంచిది కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.