రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో వరుసగా మార్కెట్లు పతనమవుతున్నాయి. వారాంతమైన శుక్రవారం కూడా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 769 పాయింట్లు నష్టపోయి 54,334 వద్ద స్థిర పడగా.. నిఫ్టీ 253 నష్టపోయి 16,245 వద్ద స్థిరపడింది. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు. అటు అంతర్జాతీయంగా ధరలు సైతం భారీగా పెరిగిపోతున్నాయి. అయితే యుద్ధం కారణంగా ఇండియన్ ఇన్వెస్టర్లు నష్టపోయింది ఉక్రెయిన్ GDP కంటే అధికంగా ఉంటుందని ఓ నివేదికలో తేలింది.