భారత వాతావరణ శాఖ – హైదరాబాద్ (IMD-H) తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాగా, గత 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెంలోని గుండాలలో అత్యధికంగా 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక, జగిత్యాలలోని ఎండపల్లిలో అత్యధికంగా 39.9 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డిలోని షాబాద్‌లో 18.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది.