భారత క్షిఫణి ఒకటి ప్రమాదవశాత్తు పాకిస్థాన్ భూబాగంలోకి దూసుకెళ్లి అక్కడ కూలిపోయింది. మార్చి 9న భారత్కు చెందిన క్షిపణి ఒకటి పాక్ భూబాగంలోకి దూసుకొచ్చి పాకిస్థాన్ మియన్ చున్ను నగరంలో సమీపంలో కూలిపోయింది. దీంతో ప్రజల ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషి, భారత్ తరుచుగా గగనతల పరిధులు ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. దీనిపై స్పందించిన భారత రక్షణ శాఖ ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగిందని తెలిపింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి ధర్యాప్తు చేపట్టేందుకు భారత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.