ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పూర్ ప్రొఫెసర్ అశోక్ కుమార్ సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేశారు. ఎముకలను పునరుత్పత్తి చేసే సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. 2 రసాయనాల పేస్ట్‌ని మిక్స్ చేసి, ప్రభావిత ప్రాంతంలో ఇంజెక్ట్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుందన్నారు. సిరామిక్ ఆధారిత మిశ్రమం బయోయాక్టివ్ అణువుల క్యారియర్‌గా పని చేస్తుందని, ఎముక తిరిగి పెరగడంలో సహాయపడుతుందని వెల్లడించారు. దీంతో సహజసిద్ధమైన ఎముకలా కృత్రిమ ఎముక తయారవుతుందని తెలిపారు.