ఇండియన్ రైల్వే మహిళల భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. రైళ్లలోని మహిళా బోగీల్లో పురుషులు ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో మహిళా కోచ్ లలో ప్రయాణించిన 7 వేల మంది పురుషులను రైల్వే శాఖ అరెస్టు చేసింది. వీరు కేవలం మే 3 నుంచి 31 మధ్య అంటే దాదాపు ఒక్క నెలలోనే ఇంతమంది ప్రయాణించినట్లు వెల్లడించింది. అయితే ఆపరేషన్ ఉమెన్ సురక్ష పేరుతో స్పెషల్ డ్రైవ్ చేపట్టగా 7 వేల మంది బుక్కయ్యారు.