ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్‌బీ) లో ఏదైనా ఆన్ లైన్ కోర్సు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. కేవలం రూ.2360 తో సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేసే అవకాశం కల్పించనుంది రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్). ఈ మేరకు ఐఎస్‌బీతో ఎస్‌బీటెట్ ఒప్పందం కుదుర్చుకుంది. కాగా ఇందులోని బిజినెస్ లిటరసీ ప్రోగ్రామ్, డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్, ఎంటర్‌ప్రెన్యూరియల్ లిటరసీ ప్రోగ్రామ్, బిహేవియరల్ స్కిల్స్ ప్రోగ్రామ్ కోర్సులను ఐఎస్‌బీలో ఉండే నిపుణులైన సిబ్బంది బోధిస్తారు. సిలబస్‌ను కూడా వారే రూపొందిస్తారు. ఒక్కో కోర్సు ఆన్లైన్‌లో 40 గంటలు ఉంటుంది. మూడు నెలలలోపు శిక్షణ పూర్తయ్యే ఈ కోర్సులో సీట్ల పరిమితి ఉండదు. మార్చి31 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 15 నుంచి కోర్సులు మొదలవుతాయి.