ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను ఇప్పటికే కొంత మందిని స్వదేశానికి తలరించారు. కాని అక్కడే ఉన్న మరికొంత మంది తమను తీసుకెళ్లాలని వాపోతున్నారు. కైవ్‌లోని పలు హాస్టళ్లల్లో ఉన్న వారు కాలినడకన రైల్వే స్టేషన్ కు తరలివస్తున్నారు. దాదాపు మూడు కిలోమీటర్లకు పైగా నడిచివస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియాలోని సరిహద్దు ప్రాంతాల్లో పలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేంద్రాలు భారతీయ పౌరులను తరలించడం కోసం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.